సరైన ఆరోగ్యం అందినచడం.. రాజ్యాంగంలో ఉంది



ఆదిలాబాదు జిల్లాలోని ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, స్థితిగతులు, అవసరాలను తెలుసు కుంటున్నామని, బలమైన ఆహారం, సరైన ఆరోగ్యం అందినచడం రాజ్యాంగంలో ఉందని జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. విద్య,వైద్య రంగాలు అభివృద్ధి చెందాలని అన్నారు. వైద్యులు దేవతా స్వరూపాలని అన్నారు. వ్యక్తి గత,ఉద్యోగ సమస్యలు విధినిర్వహణకు అడ్డు రాకూడదని అన్నారు. సభ్యులు ఎం.ఆనందరావు మాట్లాడుతూ, కమీషన్ కు అందే సమస్యలను సంబంధిత అధికారుకు పంపించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని అన్నారు. 40 శాతం అర్జీలు కలెక్టర్లు పరిష్కరిస్తున్నారని అన్నారు. పలు అంశాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు వస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర, డైరెక్టర్ కరుణాకర్, అదనపు కలెక్టర్లు నటరాజ, ఎం.డేవిడ్, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Feroz khan 9640466464

Comments