వాహనదారులు తమను చూసి పారిపోతున్నారనో.. లేదా ఇచ్చిన టార్గెట్ ప్రకారం త్వరత్వరగా చలాన్లు వేసి ఇంటికి వెళ్లిపోవాలనే ఆతృతో తెలియదు గానీ ఓ పోలీసు ‘దొంగ’లా వ్యవహరించాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో పాలు నిల్వ ఉంచే డబ్బాల వెనక దాక్కున్నాడు. తెరచాటుగా వచ్చీపోయే వాహనాల ఫోటోలు తీస్తూ కనిపించాడు. అయితే వాహనాలకు ఫైన్లు వేయాలంటే తెరచాటున దాక్కొని ఫోటోలు తీయాల్సిన పరిస్థితి పోలీసులకు ఎందుకు దాపురించిందో.. ఫైన్లు వేయడానికి పోలీసులు ఫోటోగ్రాఫర్లుగా మారిపోతున్నారనే అపవాదు ఉండగా... ఈ అత్యుత్సాహాన్ని నేర పరిశోధన, నేరాలు జరగకుండా తీసుకునే చర్యల్లో చూపిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.
ఫోటో: ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
addComments
Post a Comment