చెక్ పోస్ట్ వద్ద.. గుట్కా లభ్యం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అనుకోని ఉన్న దేవాపూర్ చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 2.5 లక్షల  విలువ గల నిషేదిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..  బుధవారం అర్థ రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు సీఐ ఈ చంద్ర మౌళి ఆధ్వర్యంలో మావాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాపుర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్న సమయంలో నిర్మల్ నుండి ఆదిలాబాద్ పట్టణానికి వస్తున్న AP 13 S 7154 కారులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు అంబర్,V1, RMD, తోట,బాబా, పేరుగలవి స్వాధీనం చేసుకున్నారు, వాటి విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందన్నారు, నిందితులు. భుక్తా పూర్ కు చెందిన కార్ డ్రైవర్ అతీక్, (31) దిగుమతి చేసుకుంటున్న సయ్యిద్ ఆలి లను అరెస్టు చేసి మావాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 


Feroz khan 9640466464


Comments