ప్రకటన విడుదల చేసిన రిమ్స్ డైరెక్టర్..
‘ఔట్ సోర్సింగ్’.. అవినీతికి వింగ్! అనే శీర్షికన ఈ నెల 10న నినాదం దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పోస్టుల భర్తీలో పారదర్శకత పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన విడుదల చేశారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టుల భర్తీ జరుగుతుందని రిమ్స్ కళాశాల సంచాలకులు డాక్టర్ బలరాం బానోద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని బయటి వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, ఎవరు ప్రలోభపెట్టినా, యాజమాన్యంతో ఎలాంటి సంబంధం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ కు గాని, జిల్లా ఉపాధి కల్పనాధికారికి గాని,రిమ్స్ డైరెక్టర్ కు గాని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. నియామకాలు చేపడుతున్న మూడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లు కూడా ఇబ్బందులు కలగజేస్తే ఫిర్యాదు చేయాలని, వారిని బ్లాక్ లిస్ట్ లో పెడతామని వివరించారు. మధ్యవర్తుల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
addComments
Post a Comment