శనివారం మానవ హక్కుల కమిషన్ బృందం రిమ్స్ ను సందర్శించింది. రోగులకు ఇక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం రిమ్స్ వైద్యులు, సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతకు ముందు రిమ్స్ ఆవరణలో కమిషన్ సభ్యులు ఆనందరావ్,
జిల్లా కలెక్టర్ సత్తాపట్నాయక్, జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్రలతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నటరాజన్, డెవిడ్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కరుణకర్, డీఎంహెచ్ వో డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ...
మానవ హక్కులను ఏ విధంగా జిల్లాలో కొనసాగుతన్నాయో తెలుసుకునేందుకు జిల్లా పర్యటన చేపట్టడం జరిగిందన్నారు. తొలుత రిమ్స్ ను సందర్శించి ఇక్కడ రోగులకు అందుతున్న సేవలు, వైద్యుల ఇబ్బందులు తదితర వాటిని పరిశీలించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మొక్కలు లేనిదే మానవ మనుగడ లేదని, దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరు నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ..
కమిషన్ చైర్మన్, సభ్యుల సూచనలతో జిల్లా యంత్రాంగం మరింత ఉత్సహంగా పని చేస్తుందన్నారు. మానవ హక్కులకు ఎక్కడ భంగం కలుగకుండా పని చేస్తామని భరోసా ఇచ్చారు. కమిషన్ పర్యటన తొలి రోజు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని అన్నారు.
జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ..
మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల దిశ దిర్దేశంతో తమ విధులను కొనసాగిస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, హక్కులకు భంగం కలుగకుండా తమ వంతుగా సహకారం అందిస్తామన్నారు.
Feroz khan 9640466464
addComments
Post a Comment