మీడియా .. ఇప్పుడు మత మార్పిడులను అతి భయంకరమైన సమస్యగా చూపిస్తోంది. ముఖ్యంగా దీనిలో టీవీ ఛానల్స్ పాత్ర ఎంతో ఎక్కువగా ఉంది. చిన్నచిన్న ఘటనలను పెద్దగా చూపుతూ.. వాస్తవాలను వక్రీకరిస్తూ.. అబద్ధాలను నిజం చేస్తూ.. నిజాలను దాచిపెడుతూ ప్రజలను వర్గీకరించే పని చేస్తోంది. తద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకునే ఒక పార్టీకి పావుగా మారుతోంది. మత మార్పిడుల వెనక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని కొన్ని మీడియా సంస్థల విష ప్రచారాన్ని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక కొట్టి పారేసింది.
ప్యూరీసెర్చ్ సెంటర్.. అమెరికాకు చెందిన ఈ సంస్థకు సర్వేల్లో ఎంతో మంచి పేరుంది. పక్షపాతం వహించకుండా సర్వే నిర్వహించే సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి సంస్థ.. భారతదేశ జనాభాలో 80 శాతం మంది హిందువులు కాగా, 14 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 97 శాతం మంది భారతీయులు తాము దేవుడిని నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే అన్ని మతాలవారు పరమత సహనం కలిగి ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది. భారతీయుడు ఇతర మతాలను గౌరవిస్తాడని 84శాతం మంది తెలిపారని సర్వే పేర్కొంది. అంతేకాకుండా ఇతర మతాలను గౌరవిస్తేనే తమ మతాన్ని సరైన రీతిలో అనుసరిస్తున్నట్టు అని 80 శాతం మంది తెలిపారు. పరమత సహనం కలిగి ఉన్నామని చాలా మంది చెబుతున్నా.. మతాంతర వివాహాలకు వ్యతిరేకించే వారు మాత్రం అధిక సంఖ్యలో.. Continue
addComments
Post a Comment