మొదటిరోజు 462 మందికి కంటి పరీక్షలు
శాంతిభద్రతల పరిరక్షణకు రేయింబవళ్ళు నిరంతరంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసుల ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించే భాగంలోనే ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు, శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్ మైదాన ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఏఎస్పి హర్షవర్ధన్ శ్రీవాస్తవ్ తో కలిసి జిల్లా ఎస్పీ ప్రారంభించారు, ఈ క్రమంలో కంటి పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో డిజిటల్ కంప్యూటరైజ్డ్ యంత్రంతో స్వయంగా కంటి పరీక్షలు నిర్వహించుకున్న అనంతరం కంటి వైద్య నిపుణులు ఎస్పికి ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు, అనంతరం పోలీసులనుద్దేశించి మాట్లాడుతూ పోలీసులకు వారి కుటుంబాలకు ఎలాంటి వైద్యపరంగా ఆరోగ్య సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలోనే మొదటిసారిగా కీలకమైన కంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు, విధి నిర్వహణ సమయంలో పోలీసులు ఆరోగ్యంగా, మనశ్శాంతితో విధులు నిర్వహించినప్పుడే సమర్థంగా పనిచేస్తారని తెలిపారు, పోలీసులు, హోంగార్డులతో పాటు కార్యాలయం అధికారులకు సైతం ఈ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు, నిరంతరం విధినిర్వహణలో పాల్గొంటున్న పోలీసులకు ముందస్తుగా ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించుకోడానికి, సమయం వీలుపడదని, అందుకే స్థానిక చోటనే వైద్య పరీక్షలకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు, కంటి పరీక్షల కోసం నివేదిక సమర్పించడంతో, వెంటనే స్పందించిన రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి సౌజన్యంతో వరంగల్ జిల్లాకు చెందిన శరత్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి బృందంచే రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు, పరీక్ష సమయంలో ఏలాంటి లోపాలు వెలుగులోకి వచ్చిన బాధితులకు పూర్తిగా ఉచితంగా ఆసుపత్రి వర్గాల ద్వారా ప్రత్యేక వాహనాల్లో వరంగల్ ప్రధాన ఆసుపత్రికి తరలించి, శస్త్రచికిత్స చేసి కోలుకున్న అనంతరం ఇంటికి చెరవేస్తారని తెలిపారు, ఈ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు వారి కుటుంబాలను కోరుతున్నట్లు తెలిపారు, మొదటిరోజు 462 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా,,18 మందికి శస్త్రచికిత్స అవసరం ఉందని నిర్ధారించారు, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, యూనిట్ డాక్టర్ సి ఆర్ గంగారాం పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు, ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎస్. శ్రీనివాసరావు, సి. సమయ్ జాన్ రావు, డిఎస్పీ ఎన్ఎస్వీ వెంకటేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఓ. సుధాకర్ రావు, అడిగొప్పుల వేణు, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, యూనిట్ సిఆర్ గంగారం, మ్యాక్స్ విజన్ క్యాంప్ ఆర్డినేటర్ దూలం ప్రవీణ్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ యోగేష్, డాక్టర్ ఎస్. అశోక్, క్యాంపు కౌన్సిలర్ ఎస్.అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Feroz khan 9640466464
addComments
Post a Comment