పదవి కోసం ఇతర పార్టీల నుంచి సైతం రావడానికి సిద్ధం..
మాజీ సభ్యుల పేర్లనూ కూడా పరిశీలిస్తున్న అధిష్టానం..
ముఖ్యంగా సయ్యద్ ఫయాజ్ పేరు పరిగణనలోకి..
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
Adilabad: కాల్పుల ఘటన తర్వాత ఎంఐఎం జిల్లా కమిటీని అధిష్టానం రద్దు చేసింది. ఫారుఖ్ అహ్మద్ ను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత.. ఆ పదవి ని సొంతం చేసుకునేందుకు పోటీ తీవ్రమైంది. ప్రస్తుతం ఆ పార్టీలో పని చేస్తున్న వారితోపాటు.. ఇతర పార్టీల వారు సైతం అధ్యక్ష స్థానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎంఐఎంకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదరణే ఇందుకు కారణమవుతోంది.
గతంలో ఎంఐఎంలో ఉండి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న సిరాజ్ ఖాద్రీ, ఎంఐఎం పార్టీలో పని చేస్తున్న సలీమ్ తోపాటు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాషిద్, ఎంఐఎం నుంచి బహిష్కరణకు గురై స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా గెలిచిన నజీర్ లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
దాదాపు 35 సంవత్సరాల తర్వాత.. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇటీవల మళ్లీ ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. పోలీసు శాఖలో ఏ.ఎస్.ఐ. గా పని చేస్తున్న ఫయాజ్ అహ్మద్ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఎంఐఎంలో చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా జిల్లా కమిటీతోపాటు, పట్టణ కమిటీని సైతం ఎన్నుకోనున్నందున ఆ పదవికి సైతం పలువురు పోటీ పడుతున్నారు.వారిలో టీఆర్ఎస్ కు చెందిన ఖిజర్, ఎంఐఎంకు చెందిన రోహిత్ పేరు ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అధిష్టానం దృష్టిలో ఎవరి పేరుంది.. అధ్యక్ష పదవి ఎవరికి దక్కే అవకాశముంది.. పదవి పొందడానికి అభ్యర్థుల ప్లస్, మైనస్ పాయింట్స్.. పూర్తి కథనం త్వరలో.
Feroz Khan 9640466464
addComments
Post a Comment