ఆదిలాబాద్, తాటిగుడ కాలనీలో ఈనెల 18న మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంఐఎం జిల్లా ప్రెసిడెంట్, మహమ్మద్ ఫారుక్ తుపాకితో జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మాజీ కౌన్సిలర్ జమీర్ ఈరోజు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా ఈరోజు పోలీస్ బందోబస్తు పర్యవేక్షణలో అంత్యక్రియలకు తాటిగూడలో ఏర్పాటు చేశారు,
అదిలాబాద్ పట్టణంలో శాంతిభద్రతలు పరిరక్షించడానికి రామగుండం సిపి వి. సత్యనారాయణ స్వయంగా హాజరై పర్యవేక్షిస్తున్నారు,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఆధ్వర్యంలో పట్టణంలో 300 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో
సిపి వి. సత్యనారాయణ మాట్లాడుతూ మహమ్మద్ ఫరూఖ్ జరిపిన కాల్పుల్లో గాయపడిన జమీర్ మృతిచెందడంతో హత్యాయత్నం కేసును మార్చి సెక్షన్ 302 IPC హత్య కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు, ప్రధాన నిందితుడు జైల్లో ఉన్నాడని ఘటన జరిగిన నిమిషంలోనే అతన్ని అదుపులో తీసుకొని ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వెంటనే నాలుగు గంటల్లోనే రిమాండు పూర్తిచేసి జైల్లో పెట్టడం జరిగిందని తెలిపారు,
ఈ హత్యాకాండ కేసులో ఎంతటివారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు, లోతుగా దర్యాప్తు చేసి మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు, ఇప్పటికే బాధితులు తరఫున ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు, ఇలాంటి సంఘటనలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని, నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు,
ప్రస్తుతం పట్టణంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని అన్ని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్ కొనసాగుతుందని తెలిపారు, పోలీసు అధికారులు ఎం. రాజేష్ చంద్ర, మంచిర్యాల్ డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, డిఎస్పి లు వెంకటేశ్వరరావు, ఉదయ్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు.
Feroz Khan 9640466464
addComments
Post a Comment