బెదిరింపులనూ ఎదుర్కొని నిలిచిన నాయకుడు
పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం
ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం
అనేక సేవా కార్యక్రమాలు
కార్యకర్తలనూ ఆదుకుంటున్న లీడరు
మంత్రులుగా పని చేసిన వారు మౌనంగా ఉంటున్నారు.. పార్టీ టికెట్టుపై పోటీ చేసిన వారు పత్తా లేకుండాపోయారు. బెదిరింపులకో.. కాంట్రాక్టులు, డబ్బుల కోసమో.. మరికొందరైతే రాజీనామా చేసి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపక్షమనేదే లేకుండా పోగా.. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారు.. ప్రశ్నించే వారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా మారారు పార్టీ మైనార్టీ సెల్ చైర్మెన్ సాజిద్ ఖాన్. నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే.. పార్టీని బతికించుకుంటున్నారు. కార్యకర్తలు పార్టీ వీడకుండా వారికి అండగా నిలుస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సాజిద్ ఖాన్ భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. నిరంతరం ప్రజల్లో కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకే ఒక్క నాయకుడు సాజిద్ ఖాన్ పై ప్రత్యేక కథనం.
(సమయవాణి – ఆదిలాబాద్ ప్రతినిధి)
ప్రత్యేక తెలంగాణ ఇచ్చినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సుమారు దశాబ్ద కాలంపాటు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. ప్రత్యేక తెలంగాణ ఇచ్చాక.. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా లేకుండాపోగా, తెలంగాణలో ప్రతిపక్షంలో నిలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నమ్మిన నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. గెలిచిన ఎమ్మెల్యేలు సైతంగులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పదవుల కోసం, పార్టీ టికెట్టు కోసం పోరాడిన వారు.. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మారారు మైనార్టీ సెల్ చైర్మెన్ సాజిద్ ఖాన్. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. గత అసెంబ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్టు నిరాకరించినా.. పార్టీని బతికించడానికి శాయాశక్తులా కృషి చేస్తున్నారు.
రాజకీయ నేపథ్యం..
ఆదిలాబాద్ కు చెందిన సాజిద్ ఖాన్ వ్యాపారవేత్త. మొదటి నుంచే సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా, తెలంగాణ లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా, ఆల్ ఇండియా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులుగా, జిల్లా గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ లో కీలక పదవుల్లో ఉన్న సమయంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. కాంగ్రెస్ లో ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లో కార్యకర్తగా పని చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి సి. రాంచంద్రారెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందారు. క్రమంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షులుగా ఎంపికై క్రమక్రమంగా ఎదిగారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మెన్ గా వ్యవహరిస్తున్నారు.
పార్టీకి అండగా..
ఎన్ని కష్టాలు ఎదురైనా సాజిద్ ఖాన్ పార్టీని వీడలేదు. కార్యకర్తలకు అండగా నిలుస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ పార్టీని బతికిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014లో పార్టీ టికెట్టుపై భార్గవ్ దేశ్ పాండే పోటీ చేయగా.. ఆయనకు అండగా నిలిచారు. 2018లో పార్టీ టికెట్టును ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల్లో ఆ టికెట్టు గండ్రత్ సుజాతకు వెళ్లింది. అయినా నిరాశ చెందలేదు. డీసీసీ అధ్యక్ష పదవికి ప్రయత్నించినా వరించలేదు. అయినా వెనకడుగు వేయలేదు. కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేసిన ఒకరు ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేయగా.. మరొకరు పత్తా లేకుండాపోయారు. ఎవరూ ఎలాంటి కార్యక్రమాలు, ప్రజా పోరాటాలు చేయకపోవడంతో అలాంటి సమయంలోనూ పార్టీని బతికించడానికి కృషి చేశారు. కార్యకర్తలకు అండగా నిలుస్తూ తానున్నానంటూ భరోసా ఇచ్చారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ.. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు సాజిద్ ఖాన్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. పేదలకు వైద్యమందేలా కృషి చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. రిమ్స్ లోని కోవిడ్ వార్డును ప్రత్యేకంగా పరిశీలించి.. వైద్యులకు పలు సూచనలు అందించారు. రోగులకు జాగ్రత్తలను సూచించారు. సెక్రెటేరియట్ లో మందిరాలు, మసీదులను కూల్చివేయడాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నాలకు నిరసనగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో కరెంటు బిల్లులు ఎక్కువగా రావడంపై ఆందోళనలు చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. బిల్లులు కట్టలేదని కొన్ని కాలనీల్లో అధికారులు కరెంట్ కట్ చేస్తుంటే వారిని అడ్డుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వచ్చిన బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేయడానికి నిరసనగా పోలీసులకు కంప్లయింట్ చేశారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసే వారి దుకాణాలను పడగొట్టడంపై వారితో కలిసి ఆందోళన చేపట్టారు. వ్యాపారం చేయడానికి స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయానికి ఎడ్లబండిపై వెళ్లి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు, ఆందోళనలో పాలుపంచుకున్నారు.
అనేక సేవా కార్యక్రమాలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ఎప్పటికీ మరిచిపోలేం. పేదలకు అండగా నిలుస్తూ.. వారికి ధైర్యాన్నిచ్చారు. వలస కూలీలను ఆదుకున్నారు. సుమారు రెండు నెలల పాటు ప్రతి రోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి పేదల ఆకలినితీర్చారు. దీని కోసం సుమారు రూ. 25 లక్షలను ఖర్చు చేశారు. వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించేందుకు శాయాశక్తులా కృషి చేశారు. జర్నలిస్టులకూ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బక్రీద్ సందర్భంగా పారిశుధ్య చర్యలపై అవగాహన కల్పించి పాలిథిన్ కవర్లు పంపిణీ చేయడమే కాకుండా.. ప్రత్యేక ట్రాలీని ఏర్పాటు చేసి వ్యర్థాలను డంపింగ్ యార్డుకు చేర్పించారు. కరోనా వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కరోనాతో మృతి చెందిన ఏఎస్ఐ అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Feroz Khan 9640466464
addComments
Post a Comment