ఆపన్నులకు ఆసరా.. అభివృద్ధికి బాసట
ఆదిలాబాద్ రూపురేఖలు మార్చిన నాయకుడు
పట్టణాభివృద్ధికి విశేష కృషి
ప్రజాసేవలో ఫారుఖ్ అహ్మద్
పార్టీ కాకపోయినా వివిధ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగే ఘనుడు అతను.. కేసీఆరే కాదు.. మంత్రి కేటీఆర్ ద్వారా ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను తెప్పించగలిగారు. పదేళ్ల పాటు మున్సిపల్ వైస్ చైర్మెన్ గా పని చేసిన ఆయన.. పట్టణ రూపురేఖలనే మార్చేశారు. అభివృద్ధిలోనే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ వాటిని దూరం చేసేందుకు కృషి చేస్తుంటారు.. అధికారంలో ఉన్నా.. లేకున్నా ఆయనకు ప్రజా సేవే ముఖ్యం.. ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు తానున్నానంటూ భరోసా నిస్తున్నారు.. ఆయనే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్. ఆదిలాబాద్ అభివృద్ధికి విశేష కృషి చేస్తూనే.. అవసరమున్న వారిని ఆదుకుంటూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అంతేకాకుండా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తూ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు..
(సమయవాణి – ఆదిలాబాద్ ప్రతినిధి)
ఆదిలాబాద్ పట్టణాభివృద్ధిలో ఫారుఖ్ అహ్మద్ పాత్ర మరువలేనిది. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. పదవిలో ఉన్నా.. లేకపోయినా... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నారు. పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. కోట్లాది రూపాయల నిధులు తెప్పించారు. ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఎంతో సన్నిహితుడు. ఆయన ద్వారా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అభివృద్ధికి నిధులను రాబట్టగలిగారు. సుమారు పదిహేనేళ్లపాటు వైస్ చైర్మన్ గా పని చేసిన ఫారుఖ్ అహ్మద్ పట్టణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి జోగురామన్న గెలుపునకు ఎంతో కృషి చేశారు. నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తున్నారు. కుల, మతాలకతీతంగా ప్రజలను ఆదుకుంటున్నారు. తానున్నానంటూ భరోసానిస్తున్నారు.
చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు
2005లో పెద్ద నాలా పనుల కోసం రూ. 1.20 కోట్లను అప్పటి ప్రభుత్వంతో మంజూరు చేయించుకోగలిగి, పనులను పూర్తి చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో నీటి సమస్య అధికంగా ఉండడంతో ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ద్వారా మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. 2014లో రెండువేల లీటర్ల 20 వాటర్ ట్యాంకులతోపాటు 20 బోర్ వెల్ లను ఏర్పాటు చేసి మోటార్లు బిగించారు. వార్డు నెంబర్ 22లో సీసీ రోడ్లు వేయడంతోపాటు డ్రైనేజీ, కల్వర్టులు, బ్రిడ్జిలు నిర్మించారు. లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. రెండు దశాబ్దాల కాలంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలతోపాటు వివిధ కలెక్టర్లతో మాట్లాడి సీబీఎఫ్, ఎస్ఎఫ్ సీ, 12, 13, 14వ ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ సాధారణ నిధులు, రాజీవ్ నగరాబ, ముఖ్యమంత్రి నిధుల ద్వారా సుమారు 12 కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం మంజూరు చేయించగలిగారు.
తాటిగూడ వార్డును హరిత వార్డుగా ఏర్పాటు చేయడానికి సొంత నిధులు. రూ. 2.44 లక్షలను ఖర్చు చేశారు. ప్రతి ఇంటి ఎదుట మొక్కలు నాటించారు. వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయించి సంరక్షణ బాధ్యతలను ఇంటి యజమానులకు అప్పగించారు. మావల నర్సరీ నుంచి మొక్కలు తీసుకురాగా, తనసొంత ఖర్చులతో ట్రీ గార్డులు, గ్రీన్ మ్యాట్ లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా హరితహారంలో భాగంగా మరెన్నో మొక్కలను నాటారా. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ సైతం ఆయనను మెచ్చుకున్నారు. ఎవరి ఇంటి ఎదుటైతే మొక్క నాటారో ఆ ఇంటి వాళ్ల అనుమతితో మృతి చెందిన వారి పేరుతో వారి స్మారకార్థం వారి పేరు పెట్టి.. మొక్కల సంరక్షణకు వినూత్న పద్ధతిని అవలంభిస్తున్నారు. మొక్కల ఎదుట నేమ్ ప్లేట్లను పెడుతున్నారు. తాటిగూడలోని మూడు మసీదుల్లో లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు చేసి సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ తో మాట్లాడి భుక్తాపూర్ లోని ఈద్గాలో ఐదు వేల లీటర్ల నీటి ట్యాంక్ ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా నీళ్లు నింపడానికి మోటార్ వేయించారు. మెర్క్యూరీ లైట్లు ఏర్పాటు చేయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల మస్జిదే ఇబ్రాహీం దగ్గర ఓ వ్యక్తి వక్ఫ్ బోర్డ్ భూమిని కబ్జా చేయగా, ఎంపీ అసదుద్దీన్ ద్వారా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి రూ. ఐదు కోట్ల విలువైన భూమిని కబ్జాదారుడి నుంచి విడిపించారు. ప్రస్తుతం ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టి, వాటితో వచ్చే ఆదాయం ద్వారా మసీదు నిర్వహణ కొనసాగుతోంది. తిర్పెల్లిలోని ఖబ్రస్థాన్ కు ప్రహరీ గోడ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
సేవా కార్యక్రమాలు
ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ. ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదిస్తున్నారు ఫారుఖ్ అహ్మద్. తన వార్డులోని ప్రజలకే కాకుండా పట్టణ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారు. అర్హులైన వారు వాటి ద్వారా లబ్ది పొందేలా అధికారులతో మాట్లాడారు. ఆసరా పెన్షన్లు, ఇతర పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తారు. నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వలస కూలీలను ఆదుకున్నారు. వారు స్వస్థలాలకు వెళ్లేలా కృషి చేశారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు జిల్లాకు వచ్చేలా ప్రయత్నించారు. అధికారులతో మాట్లాడి జిల్లా సరిహద్దులు దాటించారు. అంతేకాకుండా పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు రూ. 7.60 లక్షలను ఖర్చు చేసి నిత్యావసరాలను పేదల దగ్గరికి చేర్చారు. అంతేకాకుండా అవసరమున్న వారిని ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంటారు.
Feroz Khan 9640466464
addComments
Post a Comment