‘గో హంగర్‌ గో’చాలెంజ్ ను ప్రారంభించిన డైరెక్టర్ దుర్గే కాంతారావు


లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న నార్నూర్ ప్రజలకు వారు నిత్యావసరాలు అందిస్తున్నారు. కొన్నిచోట్ల ఆహారం కూడా పంపిణీ చేస్తున్నారు. గత నెల రోజులుగా పేదలకు సాయం అందిస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకోసం తమవంతు సహాయంగా  ‘గో హంగర్‌ గో’ చాలెంజ్‌ను నార్నూర్ పి ఏ సి యస్ డైరెక్టర్ దుర్గే కాంతారావు ప్రారంభించారు.



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రెండవ విడుత మే నెలకు సంబంధించిన  రూ.1,500 చొప్పున జమ చేస్తోంది. ఆయా బ్యాంక్ ల ముందు ప్రజలు గంటల తెరబడి నిలబడి ఉండడంతో.. మంగళవారం నార్నార్ మండల కేంద్రంలోని  యఎస్ బి హెచ్ బ్యాంక్ దగ్గర ప్రజలకు చల్లటి వాటర్ ప్యాకెట్లను అందించారు. అనంతరం మండల కేంద్రంలో నిరుపేదలకు పేదలకు నిత్యావసరాలు అందించారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ పి ఏ సి యస్ డైరెక్టర్ దుర్గే కాంతారావు, సర్పంచ్ గజానంద్ నాయక్,జాదవ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. 


Comments