లాక్ డౌన్ కారణంగా అదిలాబాద్ జిల్లాలో చిక్కుకున్న వారు ఇతర రాష్ట్రాలకు, వెళ్లేందుకు అవసరమైన అనుమతుల విధానాన్ని తెలంగాణ పోలీస్ శాఖ ఆన్ లైన్ ద్వారా అనుమతులు అందిస్తుందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వెల్లడించారు. "తెలంగాణ పోలీస్ డిజిటల్ పాస్ మేనేజ్మెంట్ సిస్టం" పేరిట https://policeportal.tspolice.gov.in/ వెబ్ సైట్ లో కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది, "ఈ-పాస్" ఆప్షన్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి దరఖాస్తుతో పాటు ఫోటోలు, ఆధార్ కార్డు తో పాటు అవసరమైన ధృవపత్రాల్ని జత చేయాలని, దరఖాస్తు పూర్తి అయిన అనంతరం వాటిని పరిశీలించి సహేతుక కారణంగా భావిస్తే ఆన్ లైన్ లోనే ఈ-పాస్ జారీ చేస్తారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు, జిల్లా వాసులు దరఖాస్తు చేసుకున్న అనంతరం సిసిటిఎన్ఎస్ విభాగం జిల్లా ఇంచార్జ్ శింగజ్ వార్ సంజీవ్ కుమార్, పర్యవేక్షణలో కంప్యూటర్ నిపుణుల బృందం జారీచేసిన ఈ- పాస్ సహాయంతోనే ఇతర రాష్ట్రాలకు లాక్ డౌన్ భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ సొంత వాహనాలపై వెళ్లొచ్చని పేర్కొన్నారు,
ఆన్ లైన్ ద్వారా అనుమతులు: ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
addComments
Post a Comment