చీప్‌ లిక్కర్‌ కు రెక్కలు

లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 42 రోజుల నిర్బంధం తర్వాత తెలంగాణలో తెరుచుకోనున్న మందుషాపుల వద్ద జనం పోటెత్తారు. మద్యం దుకాణాల వద్ద మందు బాబులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరవడానికి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, మద్యంపై 16 శాతం ధర పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 



పెరిగిన ధరలు.. ప్రతి బీర్‌పై రూ. 30 పెంపు చీప్‌ లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 40 పెంపు ఆర్డినరి లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 80 పెంపు ప్రీమియం లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 120 పెంపు స్కాచ్‌ లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 160 పెంపు


Comments