బహిరంగ మలవిసర్జన చేయకూడదని, అలా చేసిన వారి నుండి జరిమానా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్రీదేవసేన అన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకొని వ్యర్ధపు నీటిని ఆ గుంతలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రోడ్డు పై పశువులను ఉంచకూడదని, ప్రతి ఒక్కరు పశువుల షెడ్డు నిర్మించుకోవాలని అన్నారు. ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని సర్పంచ్ కు తెలిపారు. గ్రామం లోని రైతులకు రైతు బందు చెక్కులు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కళ్యాణ లక్ష్మీ డబ్బులు అందలేదని తెలిపారు. మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వర్షపాతం అధికంగా ఉన్నప్పటికీ రెండవ పంట సాగు చేయలేక పోతున్నామని తెలిపారు. వర్షం నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంతలు, కుంటలు, చెక్ డ్యామ్ లు, కాంటూరు కందకాలు ఉపాధి హామీ పథకం కింద చేసుకోవాలని అన్నారు. జిల్లాలో 44 శాతం అడవి ఉందని, జనగాం జిల్లాలో కేవలం ఒక శాతం మాత్రమే అడవి ఉన్నప్పటికీ రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. గ్రామం లో ఐక్యం గా ఉండి గ్రామాభ్యుదయానికి గ్రామస్తులు పనులు చేసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ నీరు కలుషితంగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, మిషన్ భగీరథ నల్ల నుండి తెప్పించిన నీటిని పరిశీలించి ఎలాంటి వాసనా, రంగు లేదని తెలియపరచి గ్రామస్తులకు నమ్మకం కలిగించేందుకు ఆ నీటిని కలెక్టర్ త్రాగి చూపించారు. ఇక ముందు నుండి గ్రామస్తులందరూ మిషన్ భగీరథ నీటిని త్రాగాలని అన్నారు. హోలీ పండుగను గ్రామస్తులు నిర్వహించుకోలేదని కేవలం సాంప్రదాయ కామదహనం చేసుకున్నామని రంగులకు బదులు బూడిదను పూసుకున్నామని గ్రామస్తులు కలెక్టర్ కు వివరించారు. కరోనా వైరస్ ప్రభావం వలన ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న రంగులను వినియోగించుకోలేదని కలెక్టర్ కు గ్రామస్తులు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం నిర్ములించాలని, నాళీల్లో రోడ్లపై వేయకూడదని, ప్లాస్టిక్ వినియోగం వలన కాన్సర్ కు దారి తీస్తుందని తెలిపారు. అర్హులైన వారందరికీ పెన్షన్ లు మంజూరు చేయాలనీ DRDA కు సూచించారు. మహిళా సంఘాలు, ఇస్తరాకుల యూనిట్ ఏర్పాటు చేసుకొని ఆకులతో తయారు చేసిన కప్పులు, పళ్ళాలు, గిన్నెలు వంటివి తయారు చేసుకొని ఆర్థికంగా, ఆదర్శ గ్రామంగా ఎదగాలని అన్నారు. itda ద్వారా గిరిజనులకు సహకారం అందించాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా ITDA ప్రాజెక్టు అధికారి భవిష్ మిశ్ర మాట్లాడుతూ, గిరి వికాసం కింద రైతులకు సహకారం అందిస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికీ అవసరమైన శిక్షణ ఇప్పించి ఉబర్ కంపెనీ సహకారం తో ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అనంతరం గ్రామం లో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. అంతకు ముందు ఉదయం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్ధులు మంచిగ చదువు కొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. తల్లి దండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, ఎంపీపీ జయశ్రీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్ రాథోడ్, తహసీల్దార్, సర్పంచ్ మడావి ప్రకాష్, గ్రామ పటేల్ లక్ష్మణ్, సహాయ గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య, పంచాయతీ సెక్రటరీ, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ మలవిసర్జన చేస్తే భారీ జరిమానా
addComments
Post a Comment