మిమ్మల్ని, కుటుంబసభ్యులను రక్షించుకోండి
కరోనా మహమ్మారి.. ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ కు కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కాస్త అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ ఈ మహమ్మారి విజృంభించే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిలక్షణాల గురించి అవగాహన కల్పించడానికి సమయవాణి కృషి చేస్తోంది.
వ్యాధి లక్షణాలు :
వ్యాధి లక్షణాలు :
1. జలుబు
2. జ్వరం
3. దగ్గు
4. తలనొప్పి
5. అలసటగా ఉండటం
2. జ్వరం
3. దగ్గు
4. తలనొప్పి
5. అలసటగా ఉండటం
తీసుకోవలసిన జాగ్రత్తలు :
వీలైనంతవరకు బయటకు వెళ్లకూడదు.
కుటుంబ సంభ్యులతో ఎక్కువగా కలిసి ఉండకుండా వీలైనంత దూరం పాటించాలి
దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి మోచేయిని అడ్డంగా అడ్డుపెట్టుకోవాలి
వ్యాధి లక్షణాల తీవ్రత పెరుగుతుంటే వెంటనే దగ్గరలో ఉన్న ఐసోలేషన్ కేంద్రానికి వెళ్ళాలి
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది, కనుక వీలైనంత దూరం పాటించడం శ్రేయస్కరం
కరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఆ తుంపర్ల ద్వారా వైరస్ సంక్రమిస్తుంది. కనుక తుమ్మినప్పుడు మోచేయిని అడ్డంగా పెట్టుకోవాలి
వైరస్ ఉన్న వ్యక్తి నోటినుండి వచ్చిన తుంపరలు ఏదైనా వస్తువుపై పడిన , ఆ వస్తువుని ఆరోగ్యమైన వ్యక్తి తాకడం ద్వారకుడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కనుక వీలైనంత వరకు ఏదైనా వస్తువుని తాకిన చేతులతో ముఖాన్ని, నోటిని మరియు ముక్కుని తాకడం వంటివి చేయకూడదు
చేతులను వీలైనన్ని సార్లు సబ్బుతో లేదా శానిటైజర్ లిక్విడ్ తో కడుక్కోవాలి
మొహాన్ని, నోటిని మరియు ముక్కుని చేతులతో తాకడం వీలైనంతగా తగ్గించాలి
జ్వరం, దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడం మంచిది
షేక్ హ్యాండ్ ఇవ్వడం మరియు స్పర్శతో కూడిన ఎటువంటి పలకరింపులు వద్దు
జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంచరించకుండా జాగ్రత్తలు వహించడం మంచిది.
addComments
Post a Comment