రాంలీలా మైదానంలో కూరగాయల మార్కెట్


కూరగాయల హోల్ సేల్ దుకాణాలను బస్ స్టాండ్ నుండి రాంలీలా మైదానం నకు మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్రీదేవసేన తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవిధంగా ఏర్పాట్లను కలెక్టర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. గుంపులుగా ఉండకుండా వ్యాపారులు కూరగాయలు కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, ఎం.డేవిడ్, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, DSP వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమీషనర్ ఎం.ప్రసాద్, వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.


Comments