కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రార్ధనలను ఇండ్లలోనే నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్రీదేవసేన అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ముస్లిం మైనారిటీ పెద్దలతో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో 21 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కంటెన్మెంట్ ఏరియా లోని ప్రజలు భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, గుంపులుగా ఒకే చోట చేరకూడదని, ద్విచక్ర వాహనం పై ఇద్దరు ప్రయాణించకూడదని, యువత అనవసరంగా వాహనాలపై తిరుగుతున్నారని అన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రంజాన్ నెల ప్రారంభం కానున్న దృష్ట్యా ఉపవాస దీక్షల సమయం లో ఇంటివద్దనే ప్రార్ధనలు నిర్వహించుకోవాలని తెలిపారు. కంటెన్మెంట్ ఏరియా లోని ప్రజలకు నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, పండ్లు, ఖర్జురా వంటివి ఆయా గృహాల కోరిక మేరకు ప్రత్యేక అధికారులు, గల్లీ వారియర్ ల సహకారం తో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్.పి.విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం తో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో కంటెన్మెంట్ ఏరియా లో ప్రభుత్వ సూచనలు పాటించాలని ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. రంజాన్ మాసం లో ప్రార్ధనలు ఇండ్లలోనే చేసుకోవాలని అన్నారు. వైరస్ వ్యాప్తి జరుగ కుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని అన్నారు. పండుగ ను సజావుగా ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించుకోవాలని కోరారు. అత్యవసర సమయాల్లో తనను ఫోన్ ద్వారా గాని, వాట్స్ అప్ మెస్సేజ్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ లు జి.సంధ్యారాణి, ఎం.డేవిడ్, ఆయా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment