జిల్లావ్యాప్తంగా లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు: ఎస్పీ


నియంత్రణ ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించిన ఎస్పీ విష్ణు ఎస్ వారియర్


పట్టణంలోని 19 వార్డులోని పరిధిలో కంటోన్మెంటు నియంత్రణ ప్రాంతాల్లో ప్రవేశించకుండా మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు, సోమవారం కంటోన్మెంట్ ప్రాంతాలకు వెళ్లడానికి ఎంత ఎన్టీఆర్ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన ప్రధాన చెక్ పోస్టు ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు . కంటోన్మెంట్ ప్రాంతాల్లో అనుమతులు ఉన్నవారి తప్ప ఎంతటివారైనా అనుమతించవద్దని సూచించారు, పట్టణంలో ఏకైక ప్రధాన ద్వారం ఎన్టీఆర్ చౌక్ వద్ద పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు, ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టాలని, అనవసరంగా తిరుగుతున్న వారిని గుర్తించి వెంటనే వాహనంను స్వాధీనం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గల్లి వారియర్స్ లకు సూచనలు చేస్తూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచించారు, జిల్లా సరిహద్దులో ఉన్న చెక్ పోస్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు చోట్ల చెక్ పోస్టుల ను ఏర్పాటు చేసి రేయింబవళ్ళు ఎస్ఐ స్థాయి అధికారిని నియమించి పటిష్టంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్న పోలీసులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు, స్వయం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా హ్యాండ్ సానిటేజర్స్ లతో చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సీఐ, డీఎస్పీ కార్యాలయాలు, సిసిఎస్, ఫింగర్ ప్రింట్, హెడ్ క్వార్టర్, పోలీస్ శిక్షణ కేంద్రం, పోలీస్ కార్యాలయం తదితర వాటిలో ప్రత్యేక ఆరోగ్య కిట్లు అందజేసినట్లు తెలిపారు, ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సుబ్బారావు, ఎస్సై అన్వర్ ఉల్ హక్, పట్టణ ఎస్సై జాదవ్ గుణవంత రావు, డిసిఆర్బి ఎస్సై డి ప్రభాకర్ ఇతరులు పాల్గొన్నారు.


Comments