జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు గత మూడు రోజుల నుండి కొత్తగా నమోదు కాకపోవడంతో జిల్లా ప్రజల విజయంగా భావించ వచ్చని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు, శనివారం.. సడలింపులపై వివరాలను వెల్లడించారు, నేటి నుండి పట్టణంలో లాక్ డౌన్ ఆంక్షలను సవరిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు, పట్టణంలో కంటైన్ మెంట్ ప్రాంతాల మినహా మిగిలిన సాధారణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు, ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ప్రజలను కోరారు, సమయంలో వెసులుబాటు కలగడంతో ప్రజలు తొందర పడకుండా ప్రశాంతంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ నిత్యావసర సరుకులు కొనుగోలు చేయవచ్చని సూచించారు.
సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు: ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
addComments
Post a Comment