పోలీస్ అధికారుల పదవి విరమణ


ఒకేరోజున ఐదుగురు పోలీసు అధికారులు పదవి విరమణ చేయడం పోలీస్ శాఖకు తీరనిలోటని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు, గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారుల పదవి విరమణ కార్యక్రమం జిల్లా ఎస్పీ సమక్షంలో పోలీస్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు, పదవీ విరమణ చేసిన వారిలో ట్రాఫిక్ ఎస్ఐ ఏడిపెల్లి  శ్రీనివాస్, పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్సై జి. నర్సింగ్ రావు, సాయుధ పోలీసు విభాగంలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు డబ్లు. సుధాకర్, కే. జాన్. ఏఆర్ ఎస్సై ఎం ఎ మాలిక్ లు ఉన్నారు, వీరిని గౌరవపూర్వకంగా జిల్లా ఎస్ క్యాంపు కార్యాలయంలో ఆహ్వానించి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి, అనంతరం జ్ఞాపికను బహుకరించారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విరమణ చివరి రోజుల్లో సైతం సెలవులు తీసుకోకుండా ప్రాణాలకు తెగించి క్లిష్ట పరిస్థితుల్లో అవిశ్రాంతంగా కరోనా వైరస్ విధులు నిర్వహించడం జిల్లాకే గర్వకారణమని అభినందించారు, విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు, 36 సంవత్సరాల పాటు ప్రజల సంక్షేమం కోసం శాంతిభద్రతల పరిరక్షణకు విశేష సేవలు అందించారని తెలిపారు, శేష జీవితం కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవనం సాగించాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరి ధరించే అలవాటు ప్రజలకు తెలియజేయాలని అన్నారు, విరమణ సమయంలో ప్రభుత్వపరంగా వచ్చే  ప్రయోజనాలను వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు, జిల్లాలో పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు చురుకుగా పనిచేసి పోలీసుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సూచించాలన్నారు, ఈ కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఓ. సుధాకర్ రావు, ట్రాఫిక్ సీఐ ఎన్ ప్రసాదరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సుబ్బారావు, ఎస్సై అన్వర్ ఉల్ హక్, తదితరులు పాల్గొన్నారు.


Comments